కానీ ప్రతి ఏడు ఆ ఊరిలో ఏదో ఒక వరద రూపంలో లేదా కరువు రూపంలో ప్రకృతి వైపరీత్యాలు వాస్తు ఉండేవి. చేసేది లేక ఆ ఊరి ప్రజలు ఇతర గ్రామాలకు వలసపోతున్నారు.
రమణ కుటుంబం కూడా ఆ ఊరు విడిచి పోవాలని నిశ్చయించింది. ఇంటి వస్తువులు అన్ని ఒక గుర్రపు బండిలో వేసుకుని బయలు దేరారు.
వారి ఊరి పక్కన ఉన్న అడవి దాటి వెళితే కొన్ని ఊలు ఉంటాయి అని, ఆ గ్రామా ప్రజలు ఆ అడవి గుండా ప్రయాణిస్తున్నారు, ఇంతలో కొందరు దొంగలు వాళ్ళని అడ్డగించి రమణ కుటుంబంతో సహా అందరి దగ్గర ఉన్న డబ్బు నగలు మరియు ఇతర సామాన్లు దోచుకున్నారు. చేసేది లేక ఉట్టి చేతులతో వాళ్లంతా ఆ అడవి దాటారు.
ఒక గ్రామం చేరుకొని ఆ ఊరి పెద్దల సహాయం కోరి ఆ ఊరిలో చిన్న ఇల్లు కట్టుకుని జీవించ సాగిరి. కొన్నాళ్ళకు ఆ ఊరిలో దొంగల బెడద ఎక్కువైంది. గ్రామ పెద్దలు జాగ్రత్తగా ఉండాలి అని ఊరంతా దండోరా వేయించారు.
ఆ రోజు రాత్రి పది మంది దొంగలు రమణ ఇంట్లో చొరబడి రమణను భయపెట్టారు.రమణ పేదవాడు అని తెలిసి " సరే, నువ్వు ఏమి ఇవ్వొద్దు, మేము ఇతర ప్రాంతాలకి దోచుకోవడానికి వెళ్తున్నాం, మేము రావడానికి ఎంత సమయం పట్టిన ఈ డబ్బు, నగలు కలిగిన మూట నీ దగ్గర ఉంచు, ఏదైనా పిచ్చి వేషాలు వేశావో, నిన్ను నీ కుటుంబాన్ని ఊరికెయ్ వొదళం అని భయపెట్టి, ఒక పెద్ద సంచి ఇచ్చి వెళ్లి పోయారు. రమణ సరే అని ఆ సంచిని ఒక పెట్టెలో పెట్టి తన పెరట్లో పాతి పెట్టాడు.
రమణ తన కష్టంతో తాను బ్రతుకును గడుపుతున్నాడు. పది ఏళ్ళు గడిచిన దొంగలు తిరిగి రాలేదు. రమణ కూతురుకి పెళ్లి చేసే సమయం. తనకు ఉన్నంతలో ఖర్చు చేసి వివాహం చేస్తున్న సమయంలో దొంగలు వచ్చి ఆ సంచి ఎక్కడ అని అడిగారు.
వాళ్ళను చూసి భయంతో ఆ సంచి నేను పెరట్లో పాతి పెట్టాను. అని పెరట్లోకి తీసుకెళ్లి తవ్వి వాళ్ళ సంచి వాళ్ళకి ఇచ్చేసాడు.
అది చూసి దొంగలు " నువ్వు ఎందుకు ఈ సంపద వాడుకోలేదు అని అడిగిరి. దానికి రమణ నాకు ఇతరుల సొమ్ముతో అవసరం లేదు అని చెప్పెను. రమణ మంచి తనానికి దొంగలు ఆశ్చర్యపోయిరి.
అయినా ఈ పది సంవత్సరాలలో నీకు డబ్బుత్ అవసరం రాలేదా? అని ప్రశ్నించిరి.
దానికి రమణ " వచ్చింది, న భార్య జబ్బుతో ఎన్నో దినములు గడిపింది తనకు మంచి వైద్యం చేయించే స్థోమత లేక తాను చనిపోయింది. అలాగే ఇప్పుడు న కూతురు పెళ్ళికి కూడా అవసరం వచ్చింది. నాకు ఉన్నంతలో నేను దైర్యంగా నా జీవితం వెళ్లదీశాను.
దానికి దొంగలు " మాకు నీ మంచితనం నచ్చింది. అలాగే ఇచ్చిన ఈ ధనమును తీసుకొనుటకు మేము నిరాకరిస్తున్నాము. ఈ డబ్బు నీకు కష్టకాలంలో ఉపయోగపడాలని కోరుకుంటున్నాము. ఇకపై మేము కూడా ఉన్నంతలో నీలాగే బ్రతకడానికి ప్రయత్నిస్తాం. ఈ సంచి నీవే ఉంచుకో. అని వెళ్లిపోయారు.
0 Yorumlar